కబురు న్యూస్,ఢిల్లీ,మార్చ్ 05 : సిద్ధార్థ్ యాదవ్,గుల్‌షీన్ రిసెప్షన్‌కి మోదీ రావటం హాట్ టాపిక్ గా మారింది.ఇంతకూ సిద్ధార్థ్ యాదవ్ ఎవరు?అనే తీవ్ర చర్చ జరుగుతోంది.మోదీ తన పనులతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు.మార్చి 1న ఢిల్లీలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కి ఆయన హాజరుకావటం అందరినీ షాక్ కు గురిచేసింది.ఆ రిసెప్షన్ బీజేపీ లీడర్ సిద్ధార్థ్ యాదవ్,గుల్‌షీన్‌లది.సిద్ధార్థ్ యాదవ్ ఢిల్లీ బీజేపీలో స్పోక్స్‌పర్సన్.ఆయన నాన్న బీఎస్ఎఫ్ అధికారి,1999 కార్గిల్ యుద్ధంలో చనిపోయారు.సిద్ధార్థ్ ఏబీవీపీలో కూడా పనిచేశారు.ఆయన సుప్రీంకోర్టు లాయర్ కూడా.ఆయన భార్య గుల్‌షీన్ కూడా లాయరే.మార్చి 1న ఢిల్లీలో సిద్ధార్థ్,గుల్‌షీన్ రిసెప్షన్ పెట్టుకున్నారు.మోదీ వస్తారని ఎవరూ అనుకోలేదు.కానీ ఆయన రావడం చూసి అందరూ షాక్ కి గురయ్యారు.మోదీ కొత్త జంటని విష్ చేశారు.సరదాగా “మీరిద్దరూ లాయర్లు, ఇంట్లో రోజూ గొడవలే” అన్నారు.ఆ మాటకి సిద్ధార్థ్,గుల్‌షీన్ గట్టిగా నవ్వారు.వేదికపై ఉన్న అందరూ నవ్వుకున్నారు.సిద్ధార్థ్ యాదవ్ ఆ ఫోటోలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. “మా పెళ్ళికి మోదీ వచ్చి మమ్మల్ని దీవించారు.ఇది మా అదృష్టం.మోదీకి చాలా థాంక్స్! అని రాశారు.మోదీ తన కొడుకుని,కోడల్ని దీవిస్తుంటే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ సుధా యాదవ్ ఎమోషనల్ అయ్యారు.మోదీకి థాంక్స్ చెప్పారు.మోదీ సిద్ధార్థ్ యాదవ్ పెళ్ళికి రావటం చూస్తే,ఆయన రాజకీయాల్లోనే కాదు,కార్యకర్తల వ్యక్తిగత విషయాల్లో కూడా పాలుపంచుకుంటారని తెలుస్తుంది.ఇది సిద్ధార్థ్‌కి,గుల్‌షీన్‌కి ఒక మంచి మెమరీ ఉండిపోయింది..
