ఇద్దరి విద్యార్ధినుల మధ్య గొడవ…
తోసేయడంతోనే కిందపడ్డట్లు సమాచారం…
కబురు న్యూస్,తిరుపతి,మార్చ్ 16 :
తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఓ విద్యార్థిని రెండో ఫ్లోర్ నుంచి కింద పడిపోవడం కలకలం రేపింది.విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన సమయంలో తోటి విద్యార్థిని ఆమెను పైనుంచి తోసేసిందని విశ్వసనీయ సమాచారం.కింద పడిన బాలికకు నడుము విరగడంతో పాటు తీవ్ర గాయాలవడంతో స్కూలు యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై తిరుపతి అర్బన్ తాసిల్దార్ విచారిస్తున్నట్లు తెలిసింది..

Author: Kaburu Daily News
Post Views: 593