హోళీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి…
పండగ వేళ అల్లర్లకు పాల్పడితే ఊపేక్షించం…
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చ్ 13 :
నలుగురు కలిసి ఇష్టపడి చేసుకునేది హోలీ పండుగని,ఒకరిని కష్టపెట్టి ఇష్టం లేని వారిపై రంగులు పూయడం పోయడం కూడా నేరమని నిజామాబాద్ సిపి సాయి చైతన్య అన్నారు.నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబసమేతంగా హోళీ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ ప్రజలకు సూచించారు. ఎవరికైనా ఇబ్బందులను సృష్టిస్తూ ఇష్టం లేని వారి పైన బలవంతంగా రంగులు పూస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హోళీ సందర్భంగా ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను వినియోగించాలని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు వేడుక జరుపుకోవాలని చెప్పారు.ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు,వాహనాలపై రంగులు చల్లటం,రంగు నీళ్లను పోయడం సరికాదని అన్నారు.బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులు పెట్టడం,అసభ్యకరంగా ప్రవర్తించడం,అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.బైక్‌లతో ర్యాలీలు చేయడం,రహదారులపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు తిరగడం చేయవద్దని హితవు పలికారు.హోళీ పండగ నాడు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని,మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని సూచించారు.మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలన్నారు.కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు.
