- ప్రజలకు వారదలుగా ఉంటామే తప్ప స్వార్థంతో కాదు…
- ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఏ శాఖ ఐనా ఎవరైనా తప్పకుండా జర్నలిజం స్పందిస్తుంది…
- వార్తలోని అనుకోని పొరపాటుని జీర్ణించుకోలేని ఎస్ఈ రవీందర్…
- ఎటువంటి వార్త కథనాలకైనా వెనుకాడేది లేదు..
- వాస్తవాలు వెలికి తీయడమే మా నైజం జర్నలిజం…
కబురు న్యూస్,నిజామాబాద్ టౌన్, ఫిబ్రవరి 05 :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరుని ఆలయంలో ప్రతి ఏడు మాదిరిగా ఈ ఏడు కూడా రథసప్తమి వేడుకలు నిర్వహించుకుంటున్న సందర్భంలో సెంట్రల్ లైట్లు వెలగకపోవడంతో భక్తులు అగచాట్లు,ఆగ్రహాన్ని గమనించిన కబురు పాత్రికేయులు చిమ్మని చీకట్లో శ్రీ నీలకంఠేశ్వరుని రథోత్సవం..ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు అనే శీర్షికన కథనాన్ని ప్రచురించడం జరిగింది.వాస్తవానికి సెంట్రల్ లైటింగ్ పర్యవేక్షణ మున్సిపాలిటీ నిజామాబాద్ వారిది అయినప్పటికీ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అది గమనించిన కబురు పాత్రికేయులు ప్రజలకు కలిగిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖ పట్ల వార్తను ప్రచురించటం జరిగింది. ఈ వార్తను పరిశీలించిన నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖకు చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రవీందర్ వాట్సాప్ చాటింగ్ లో బెదిరింపులకు దిగారు. వార్త కథనంలో ప్రజల ఆగ్రహాన్ని, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రచురితమైన వార్త కథనంలో పొరపాటున గమనించిన ఎస్ఈ రవీందర్ అవగాహన కల్పించాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడడం శోచనీయం. సహజంగా వార్తా కథనాల్లో కానీ మనిషి నిజ జీవితంలో కానీ పొరపాటు తప్పిదాలు జరగడం మానవ సహజం.వార్త కథనంలో పొరపాటున సరిచేసి సంస్కారాన్ని నిలబెట్టుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారి రవీందర్ బెదిరింపులకు దిగడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరుని ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు రోజులు భక్తులు జాతర,వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.మంగళవారం రోజున రథోత్సవ ఊరేగింపులో ఇసుకేస్తే రాలనంత భక్త జన సందోహం కండ్లకు కట్టినట్టు స్పష్టంగా కనిపించింది. అలాగే విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం కూడా అందరికీ తెలిసిందే.రథసప్తమి రథోత్సవ ప్రారంభ వేడుకలకు ముందే డివైడర్ పై ఉన్న సెంట్రల్ లైటింగ్ సరి చేయాల్సింది పోయి,అలాగే ఉండడం పట్ల ప్రభుత్వ అధికారుల అలసత్వం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఏది ఏమైనా ఒక పద్ధతిగా స్పందించాల్సిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఎస్ఈ రవీందర్ వాట్సాప్ చాటింగ్ లో స్పందించిన తీరు ఏం బాగు లేదని భక్తులు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సానుకూలంగా స్పందించి పొరపాటును సరి చేయాల్సిన ఓ బాధ్యత కలిగిన ఉన్నతాధికారిగా అలా బెదిరిస్తూ మెసేజ్ చేయడం పద్ధతి కాదని భక్తులు ప్రజలు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన విధానం మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికార యంత్రాంగం ఓపికతో ఉండాలి తప్ప ఆగ్రహానికి ఆవేశానికి ఒత్తిడికి లోను కావద్దని స్థానిక ప్రజలు శ్రీ నీలకంఠేశ్వరుని భక్తులు హితవు పలికారు.
