కన్నుమూసిన గొర్రెపాటి మాధవరావు..
కబురు న్యూస్,నిజామాబాద్,డిసెంబర్ :
- నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు కన్నుమూశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండె నొప్పితో కొద్దిరోజుల క్రితం హాస్పిటల్లో చేరిన ఆయన అస్వస్థకు గురై మరణించారు.హక్కుల ఉద్యమానికి,ప్రజాస్వామిక ఉద్యమాలకు గోర్రెపాటి మాధవరావు మరణం తీరని లోటు.ప్రముఖ న్యాయవాది గోర్రెపాటి మాధవరావు నిజామాబాద్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాలకు పైగా హక్కుల గోంతుకగా మాధవరావు నిలిచారు.రైతుల ఆత్మహత్యలపై చలించాడు.ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే కథనాలు పత్రికల్లో రాశారు.విప్లవోధ్యమ మేథావిగా జిల్లాలో పెద్ద దిక్కుగా పనిచేశారు.ఎన్ కౌంటర్ కేసులను కూడా చేధించి భాదితులకు నష్టపరిహారం అందేలా కేసులు వాదించి విజయం సాధించారు.మానవహక్కుల హననానికి ఎవరు పాల్పడిన నిలదీయడంలో, బాధితులకు అండగా ఉండడంలో మాధవరావు ముందు వరుసలో ఉన్నారు. పిడిఎస్ యు నిర్మాత జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ పేరు మీద నిజామాబాద్ కోటగల్లిలో గ్రంథాలయం ఏర్పాటు చేసి దాని నిర్వహణ భాధ్యతలు చూస్తున్నాడు.సామాజిక సమస్యలపై స్పందించేవారు. కదిలించేవారు.ఆయన మరణం హక్కుల ఉద్యమానికి,సామాజిక ఉద్యమాలకు,విప్లవోధ్యమాలకు తీరని లోటు.ఆయన స్వస్థలం కోటగిరి మండలం బస్వపూర్ గ్రామం.ఆయన పార్థివ దేహం నిజామాబాదులోని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. అప్పటివరకు ఎల్లమ్మ గుట్టలోని ఆయన నివాసంలో సందర్శకుల నిమిత్తం అందుబాటులో ఉంచుతారని తెలిసింది.

Author: Kaburu Daily News
Post Views: 501