కాకతీయ విద్యాసంస్థలో ఆగని అరాచకాలు..
కాకతీయ విద్యాసంస్థలో విద్యార్థిని అవమానించిన ఉపాధ్యాయుడు..
తీవ్ర మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం…
సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో ఘటన…
కాకతీయ విద్యాసంస్థలో వెలుగులోకి వచ్చిన మరో ఘటన…
కబురు న్యూస్,నిజామాబాద్, డిసెంబర్ 20 :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థలో శివ జష్విత్ రెడ్డి అనుమానాస్పద మృతి ఘటన మరవకముందే మరో మరో ఘటన శుక్రవారం రోజున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు,విద్యార్థి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ విద్యాసంస్థలో 8 వ తరగతి విద్యార్థి తన్మయిని తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో తీవ్ర మనస్థాపంకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది.తల్లిదండ్రులు,విద్యార్థి తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో తన్మయి అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు.గత నాలుగు రోజుల క్రితం సదరు విద్యార్థికి మూత్రం రావడంతో ఉపాధ్యాయుడి అనుతితో బాత్రూంకి వెళ్ళాడు.తొందరపాటులో ప్యాంటు జిప్ పెట్టుకోవడం మరచి పరుగు పరుగున తరగతి గదిలోకి వచ్చాడు.అది గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థి జీప్ పెట్టుకోలేదని స్టేజిపైకి ఎక్కించి జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడంటూ,ఇటు చూడండంటూ తోటి విద్యార్థులకు చెబుతూ కాసేపు విద్యార్థిని స్టేజిపైనే నిలబెట్టాడు.దీంతో తోటి విద్యార్థుల మధ్య తీవ్ర మనస్థాపానికి గురై బాధపడ్డాడు.పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా పలుమార్లు బోరున ఏడ్చాడు.తల్లిదండ్రులు కుమారుడిని విషయం అడుగగా ఏమాత్రం చెప్పలేదు.ఇటు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్ప లేక అటు స్నేహితులకు మొఖం చూపించుకోలేక కోన్ని రోజులపాటు తల్లడిల్లి పోయాడు.అంతటితో ఆగకుండా పలుమార్లు ఇంటి బంగ్లాపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.దీంతో విద్యార్థి తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీయగా విషయం కాస్త తల్లిదండ్రులకు తెలిసింది.ఈ విషయమై పాఠశాలలో ఇంచార్జికి అడగగా విచారణ చేపడతామని మాట దాట వేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.ఇప్పటి వరకు ఈ ఘటనపై పాఠశాల స్పందించకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు పోలీసు శాఖ వెంటనే స్పందించి న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ ఘటనపై మూడవ టౌన్ పోలీస్ స్టేషనులో,జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.అదేవిధంగా ఆన్లైన్లో బాలల హక్కుల చట్టం చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన అధికారులు విద్యార్థి నివాసానికి వచ్చారు.విద్యార్థితో ఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని కౌన్సిలింగ్ నిర్వ హించారు. విద్యార్థుల పట్ల నిరంకుషత్వానికి పాల్పడుతున్న నియంత కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యంపై సంబంధిత శాఖ ఏ విధమైన చర్యలు చేపడుతుందో వేచి చూడవలసిందే మరి..
