విష్ణును హెచ్చరించిన రాచకొండ సీపీ..
కబురు న్యూస్,హైదారాబాద్,డిసెంబర్ 12 :
మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలకు సంబంధించి దాదాపు గంటన్నర సేపు మంచు విష్ణును విచారించిన హైదరాబాద్ రాచకొండ సీపీ సుధీర్ బాబు.నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు.మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని గట్టిగా మందలించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని ఒకవేళ అలా చేస్తే,జరిమానాతో పాటు ఖశ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ,బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సీపీ ఆదేశించారు.జల్‌పల్లి నివాసంలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీని పంపించాలని విష్ణును సీపీ ఆదేశించారు.జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సీపీ సుధీర్ బాబు బాండ్ పేపర్లపై విష్ణు సంతకాలు తీసుకున్నారు..

Author: Kaburu Daily News
Post Views: 860