ఆరుణోదయ 50 వసంతాల సభలను జయప్రదం చేయండి..
అరుణోదయ జాతీయ అధ్యక్షులు విమలక్క…
అణగారిన వర్గాల అభ్యున్నతికై పోరాటం చేస్తుందన్న దరువు అంజన్న..
కుత్బుల్లాపూర్,డిసెంబర్ 11(కబురు న్యూస్) :
సమ సమాజ స్థాపన కోసం గత యాభై సంవత్సరాల నుండి అరుణోదయ ఎనలేని పోరాటం చేస్తుందని, ప్రాచ్చాతికరణను, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ అనుదినం ఆటపాటల ద్వారా జనాన్ని మేల్కొల్పుతోందని అరుణోదయ సంస్కృతి సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క అన్నారు.ఈనెల 14,15 తేదీలలో హైదరాబాదులో జరిగే అరుణోదయ 50 వసంతాల సభలను విజయవంతం చేయాలని కోరారు.ఓయూ జేఏసీ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దరువు అంజన్న మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ పాత్ర ఎంతో గొప్పదని తెలంగాణ పల్లె పల్లెలో తిరిగి ప్రతి గడపగడపను తాకి ప్రజా ఉద్యమాన్ని ఉవ్వెత్తి లేపిన ఘనత అరుణోదయదని కొనియాడారు.ఈ సందర్భంగా గాజులరామారంలో కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ మల్సూర్, రమేష్ పోతుల, ప్రజా సంఘాల నుండి శ్రావణి శ్రీనివాస్,సునీత, సూర్యనారాయణ, అర్చన, పాత్రికేయులు శ్రావణ్, బాలరాజ్, సాయిరాజ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
