బోధన్ లో భారీ మొత్తంలో ఆల్ఫాజొలం పట్టివేత..
కబురు న్యూస్,బోధన్ క్రైమ్,డిసెంబర్11 :
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ దాడులు జరిపి కొద్ది సేపటి క్రితం భారీ మొత్తంలో ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బోధన్ పట్టణంలో కాపుగాసి మహారాష్ట్ర నుండి సిరిసిల్లకు తరలిస్తుండగా బోధనలో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న ఆల్ఫాజొలం ఐదు కిలోలకు పైబడే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బోధన్ పై నిఘా పెట్టిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతి తక్కువ కాలంలోనే దాడులు జరిపి ఆల్ఫాజూలం మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలుర,బోధన్ మీదుగా ఆల్ఫాజూలం మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న స్టేట్ టాస్క్ ఫోర్స్ బోధన్ పై గట్టి నిఘానే పెట్టారు. ప్రస్తుతం స్టేట్ టాస్క్ ఫోర్స్ బోధన్ లోని స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన మత్తు పదార్థాలను పూర్తి నిర్ధారణ అనంతరం స్థానిక ఎక్సైజ్ పోలీసులకు అప్పగించనున్నట్లు తెలిసింది.పూర్తి సమాచారం కొరకై జిల్లా,స్థానిక ఎక్సైజ్ పోలీసులను ఫోనులో కబురు న్యూస్ సంప్రదించగా లైన్లోకి రావడం లేదు..
