మీడియాపై మోహన్ బాబు దా(డి)దాగిరి
కవరేజీ కొరకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి అమానుషం..
తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్టు సంఘాలు..
బహిరంగ క్షమాపణ తెలపని యెడల మీడియా అకాడమి చైర్మన్,డిజిపికి పిర్యాదు చేస్తామన్న సంఘాలు..
కబురు న్యూస్,హైదారాబాద్,డిసెంబర్ 10 :
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల స్థానంలో ఉన్న కథానాయకుడు,విలక్షణ నటుడు మోహన్ బాబు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చల్ పల్లి లోని ఆయన ఇంటి వద్ద అందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా టీవీ9,టీవీ5లకు చెందిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన మంచు మోహన్ బాబు కుటుంబ ఘర్షణ రోడ్డున పడడం అందరికీ తెలిసినదే.మంచు మనోజ్ కుమార్ పై దాడి జరగగా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని,వైద్యులు ఉండాలని కోరినా మరునాడు తిరిగి వస్తానని వెళ్లిన సంగతి కూడా అందరికీ తెలిసినదే.దీనిలో భాగంగా మంచు మనోజ్ కుటుంబం తన కుటుంబంపై ప్రాణాపాయం ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన తండ్రి మోహన్ బాబు అన్న మంచు విష్ణుల ద్వారా నాకు ప్రాణ భయం ఉందని,అలాగే నాకు రక్షణ కల్పించవలసిందిగా అంటూ పోలీసులను కోరడం జరిగింది.దీనికి ముందు రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది.దీంట్లో భాగంగా మీడియా ప్రతినిధులు బయటకు పొక్కిన కుటుంబ కలహాలు,ఘర్షణలను కవరేజ్ చేయటానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అందరూ చూస్తుండగా,మంచు మోహన్ బాబు దాడి చేయడం సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.కుటుంబ వ్యవహారాలకు,కలహాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డున పడి మోహన్ బాబు తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించుకోవడమే కాక మీడియా ప్రతినిధులపై దాడి చేస్తూ,బౌన్సర్ల చేత తోసి వేయడంతో కిందపడ్డ ప్రతినిధులతో సహా కెమెరాలు కూడా ధ్వంసం అయ్యాయని అక్కడ చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియాపై దాడికి పూనుకున్న మంచు మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మీడియా ప్రతినిధులు,జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.లేనియెడల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర పోలీస్ డిజిపికి మోహన్ బాబు పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
