జాతీయ జెండా రూపంలో ఉన్న కేక్ ను కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు.
ఆర్మూరులో జరిపిన సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల్లో ఈ ఘటన…
కబురు న్యూస్,నిజామాబాద్,ఆర్మూర్,డిసెంబర్ 09
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలలో జాతీయ జెండా కలిగిన కేకుని కట్ చేయడం వివాదాస్పదంగా మారింది.జన్మదిన వేడుకలు ఎంతటి వారివి అయిన కానీ జాతీయ జెండా కలిగిన కేక్ కట్ చేయడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జాతీయ జెండా కలిగిన కేకు అని తెలిసినా కూడా బాధ్యతగల ఏఎంసి చైర్మన్ సాయిబాబాగౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కట్ చేయడం వెనుక అంతర్యం ఏమిటోనని ప్రజలు మండిపడుతున్నారు. ఇది తెలిసి చేసిన తప్పేనని,ఈ ఘటన పట్ల అధికారులు ఉపేక్షించకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఒక రకంగా తెలిసి కావాలని జాతీయ జెండాను తీవ్రంగా అవమానించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అధికార దురహంకారంతో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ సంఘటనపై పౌర హక్కుల నేతలు, ప్రజలు, ప్రతిపక్షా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సంఘటనపై జిల్లా అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
