బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..
జల్సాల కోసం బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి ఆదివారం తెలిపారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన ప్రశాంత్ (28) జల్సాల కోసం నగరంలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకోనీ విచరించగా బైకు చోరీల నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ప్రశాంత్ నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకుని, రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. కేసును చేదించిన ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుల్ గంగారం, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.

Author: Kaburu Daily News
Post Views: 1,225