నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఆదివారం వెలుగు చూసింది. స్థానికంగా ఉండే ట్రాన్స్ పోర్ట్ షాప్ ఎదుట నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఉదయం షాప్ యజమాని వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో సదురు వ్యక్తి మృతి చెంది ఉండడంతో వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి మృతదేహాన్ని పంచనామ నిమిత్తం మార్చరికి తరలించారు. డాగ్ స్క్వాడ్ బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Author: Kaburu Daily News
Post Views: 1,126