మైనర్ బాలికను నమ్మించి లాడ్జ్ కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒకరు, సహకరించిన మరొకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సిఐ మల్లేష్ గురువారం తెలిపారు. ఈ మేరకు డిచ్పల్లిలోని తన సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెలలో జక్రాన్ పల్లికి చెందిన అజయ్ అనే యువకుడు ఓ మైనర్ బాలికకు నమ్మించి, నిర్మల్ కు తీసుకెళ్లి అక్కడ వెంకట సాయి లాడ్జిలో బాలికపై లైంగిక దాడి చేశాడు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అజయ్ ను గత నెల 31న రిమాండ్ కు తరలించగా, అతడికి సహకరించిన లాడ్జి మేనేజర్ సత్యనారాయణ ను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. కార్యక్రమంలో జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి ఉన్నారు.

Author: Kaburu Daily News
Post Views: 73