తెలుగు రాష్ట్రాల్లో 5.3 తీవ్రతతో భూకంపం!..
కబురు న్యూస్,హైదారాబాద్,డిసెంబర్ 04 :
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని,కాళ్లు వనికిపోవడం గమనించామని ప్రజలు అక్కడి అనుభవాలని తెలియజేశారు.అపార్ట్మెంతులోని 17వ అంతస్తులోను ఆ వైబ్రేషన్స్ గుర్తించామంటున్నారు.మరికొంద రైతే చచ్చిపోతామేమోనని అనుకున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు.అపార్టుమెంటులలో పై అంతస్తులో ఉన్నవారు భయాందోళనకు గురవుతున్నారు.మొత్తానికి ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం కాలేదని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..

Author: Kaburu Daily News
Post Views: 374