పాపం ఎటిఎంకి వెళ్ళాడు..శవమై తేలాడు!!..
కబురు న్యూస్,చెన్నై,డిసెంబర్ 01 :
ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో కురుస్తున్న వర్షాలకు ఓ నిండుప్రాణం బలైంది.డబ్బులు తీసుకునేందుకు మన్నాడి ప్రాంతంలోని ఏటీఎంకు వెళ్లిన ఓ వ్యక్తి,వరద నీటిలో విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.అతడి మృతదేహం వరద నీటిలో తేలుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.మృతుడు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా గుర్తించామని,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.

Author: Kaburu Daily News
Post Views: 541