దేశంలోనే ఉత్తమ పోలీసు స్టేషన్..
కబురు న్యూస్,హైదారాబాద్,డిసెంబర్ 01 :
2024 సంవత్సరమునకు గాను పోలీసుస్టేషన్ల పై దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో తెలంగాణలోని హైదరాబాద్ శాలిబండ పోలీసు స్టేషన్ దేశం మొత్తంలో 8 వ ఉత్తమ పోలీసుస్టేషన్ గా ఎంపికైంది.ప్రస్తుతం అక్కడ ముగ్గురు ఎస్సైలు,ఆరుగురు హెడ్ కానిస్టేబుల్లు,30 కానిస్టేబుల్స్,6 గురు హోం గార్డులు పని చేస్తున్నారు.ఈ సందర్భంగా శాలిబండ పోలీస్ స్టేషన్ సిబ్బందిని తెలంగాణ డీజీపీ అభినందించారు.

Author: Kaburu Daily News
Post Views: 380