గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని NH44 జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. జక్రాన్ పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాలు ప్రకారం. పెర్కిట్ గ్రామానికి చెందిన మహమ్మద్ సోహెల్ జక్రాన్ పల్లి నుంచి ఈరోజు సాయంత్రం ఆర్మూర్ వైపు ఎలక్ట్రిక్ స్కూటీపై వెళ్తుండగా సికింద్రాపూర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సోహెల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని డిచ్పల్లి సిఐ మల్లేష్ పరిశీలించారు..

Author: Kaburu Daily News
Post Views: 767