కలకలం రేపుతున్న మావోయిస్టు లేఖ..
బీఆర్ఎస్‌కు వార్నింగ్..!!
కబురు న్యూస్,జయశంకర్ భూపాలపల్లి,అక్టోబర్ 30 :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది.బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు.మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దళిత బంధు పేరుతో అమాయక ప్రజలను మోసం చేశారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.దళిత బందు పథకం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి,దళితుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు,పార్టీ మండల అధ్యక్షుల పేర్లను లేఖలో పేర్కొన్నారు.ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Author: Kaburu Daily News
Post Views: 948