కేసీ వేణుగోపాల్ ను కలిసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,అక్టోబర్ 25 :
రాష్ట్ర టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం రోజున కుటుంబ సమేతంగా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వేణుగోపాల్ కు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ,రాష్ట్రంలో పార్టీని క్షేత్రా స్థాయిలో బలోపేతం చేసే ప్రణాళికను ఆయనకు వివరించారు.టీపీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన నుండి నేటి వరకు చేపట్టిన పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు.రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ హామీలు,రుణమాఫీ,నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతో పాటు స్కిల్ యూనివర్సిటీ,విదేశీ పెట్టుబడులపై ఆయనతో చర్చించారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నాయకులను గుర్తించి నామినేటెడ్ పోస్టులను అందిస్తూ,నాయకుల మధ్య సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. ప్రతి పక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడుతూ,ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరును వివరించారు.టీపీసీసీ కార్యవర్గ ఏర్పాటును త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
