నుడా అధ్యక్షునిగా కేశవేణు ప్రమాణం..
కబురు న్యూస్,నిజామాబాద్ టౌన్,అక్టోబర్ 21 :
కాంగ్రెస్ పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంబించిన కేశ వేణు అంచెలంచెలుగా ఎదిగి సోమవారం ఉదయం మంచి ముహూర్తపు సమయాన నిజామాబాద్ అర్బన్ డెవలపమెంట్ అథారిటీ (చైర్మన్) అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు.కొన్ని రోజుల క్రితం నుడా చైర్మన్ గా పీసీసీ చీఫ్ చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకున్న విషయం తెలిసిందే.గత నాలుగు రోజుల క్రితం నుండే నిజామాబాద్ నగరంలో కేశ వేణు అభిమానులు హార్డింగ్స్,ప్లెక్సీలతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.డీఎస్ శిష్యునిగా పేరొందిన కేశవేణు తన రాజకీయ జీవితాన్ని ఎటువంటి ఆటుపోట్లకు గురికాకుండా ముందుకు సాగుతూ వచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం పార్టీ మార్పుకోసం ఎన్ని రకాలుగా అవకాశాలు వచ్చినా,ప్రలోభాలకు గురి చేసినా నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు.ఒకింత ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న అభిమానుల ద్వారా ఆలోచన కలిగినా పార్టీ రాష్ట్ర నాయకత్వం,అధిష్టానం సూచనల మేరకు మిన్నకుండి ఉండిపోయిన నైజం కేశ వేణుదన్న ముచ్చట అందరికి తెలిసినదే.ఆ శ్రమకు తగ్గ నేటి ఫలితమే నుడా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు.
అందరితో కలివిడిగా కలిసిపోయే వ్యక్తిగా మంచి గుర్తింపు కూడా ఆయన స్వంతమైనది.కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన అభిమానులు బాణసంచాలు పేలుస్తూ ఆయనను పాత మున్సిపాలిటీ కార్యాలయంలోకి ఘనంగా స్వాగతం పలికారు.గత నాలుగు రోజుల నుండి ఆయన పట్ల చూపిస్తున్న అభిమానుల అభిమానాన్ని చూసిన సీనియర్ ప్రజాప్రతినిధులు కూడా నోటి మీద వెలేసుకున్నారంటే అతిశయోక్తి లేదు.. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరియైన సముచిత స్థానమే కల్పించిందని చర్చించుకుంటున్నారు.
