తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్..
అధికారిక ప్రకటన జారీ చేసిన అధిష్టానం..
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..
వీడిపోయిన సందిగ్ధం..
కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,సెప్టెంబర్ 06 :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేశకుమార్ గౌడ్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.ఎన్ఎస్ యూఐ నేతగా పార్టీలో అరంగేట్రం చేసిన మహేశ్ కుమార్ గౌడ్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.అధిష్టానం వద్ద ఆయనకు మంచి పేరుంది.ఈ క్రమంలోనే పీసీసీ పగ్గాలు అప్పజెప్పారు.నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఇంతకాలంగా ఉన్న సందిగ్ధం నేటితో సమసిపోయిందని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.పార్టీలోకి అరంగేట్రం చేసిన మహేష్ కుమార్ గౌడ్ ఆది నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మహేష్ కుమార్ గౌడ్ వమ్ము చేయకుండా అధిష్టానం వద్ద బలమైన నమ్మకాన్ని పదిలం చేసుకున్నాడు.దాని ఫలితమే నేడు టిపిసీసీ అధ్యక్షునిగా నియమితులయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి.ప్రస్తుతం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న ఆయన పూర్తి అధికారిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించబోతున్నారు..గతంలో నిజామాబాద్ నుండి ధర్మపురి శ్రీనివాస్ టిపిసిసి చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తెచ్చి పెట్టారు..మరో మారు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జిల్లాను ముందు వరుసలోకి తెచ్చారని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
