కర్నె హన్మంత్ రావు ఆలయ అధ్యక్ష పదవికి పనికిరాడా??..
బోధనులో చర్చనీయాంశంగా మారిన శ్రీ ఏక చక్రేశ్వర ఆలయ అధ్యక్ష పదవి..
గ్రామస్తులను మాత్రమే కమిటీలో వేయాలని డిమాండ్…
హన్మంత్ రావును తప్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు..
ఈ అవమానం గ్రామానికి జరిగినట్లే అంటున్న స్థానికులు…
ఇకపై ఆలయాలకు గ్రామస్తులను,అనుభజ్ఞులను మాత్రమే వేయాలి…
లింగాయత్ సమాజ్ లో అవమానానికి గురైన హన్మంత్ రావు…
ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఆయన సతీమణి…
ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రేనని గ్రామస్థుల ఆరోపణ..
ఎమ్మెల్యేకు కనీసం ఆలోచన కూడా రాలేదానని స్థానిక ప్రజలు విస్మయం..
కబురు న్యూస్,బోధన్,ఆగస్టు 10 :
పాపం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పాన్ గల్లీకి చెందిన మృదు స్వభావి,వివాదరహితుడు గ్రామంలో అందరి ఆదరణ అభిమానాలు పొందిన మంచి మనిషి కర్నె హన్మంత్ రావుకు ఘోర అవమానం జరిగింది..
వివరాల్లోకి వెళితే,
ఆయన కాంగ్రెసుకు ఊపిరి ఆయువు పట్టు అటువంటి బోధన్ గ్రామ నివాసి అయిన ఆయన ప్రస్తుతం గ్రామంలో 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక కౌన్సిలర్.ఆయన కోరుకోకపోయినా ఆయనను పిలిచి బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొనసాగాలని ప్రస్తుత బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి,మార్చి 2024 జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉండాలని కోరడం జరిగింది.ఎమ్మెల్యే సూచనల మేరకు కర్నె హన్మంత్ రావు ఆలయ ట్రస్టు బోర్డు తాత్కాలిక చైర్మన్ గా కోసాగుతూ వచ్చారు.ఆయనను చైర్మన్ గా ప్రకటించిన అనంతరం లింగాయాత్ సమాజ్ కూడా ఆయనకు ఘనంగా సత్కరించి సన్మానం కూడా చేశారు.ఇంతలోనే కొందరు రాజకీయ కుట్రకు తెరలేపి కర్నె హన్మంత్ రావును చైర్మన్ స్థానం,పదవి నుండి జరిపేలా కుట్ర పన్నారు.ఆయనకు జరిగిన అవమానాన్ని బోధన్ పట్టణ గ్రామస్తులు ఘోర అవమానం జరిగిందని ఆశ్చర్యం,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..అన్ని తెలిసిన అనుభవజ్ఞులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ రకంగా చేయడం భావ్యం కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.గతంలో ఎవరు తాత్కాలికంగా ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినా,తదుపరి వారినే స్థానిక శాసన సభ్యులు అధికారికంగా నియమించేవారు.ఇలా కొనసాగిన ఆనవాయితీని తుంగలో తొక్కి ప్రస్తుతం ఇంకొకరిని శివాలయం చైర్మన్ గా ప్రకటించడంలో ఆంతర్యమేమని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.బోధన పట్టణంలో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది..ప్రజలు సుదర్శన్ రెడ్డి పట్ల ముక్కున వేలేసుకుంటున్నారు.ఇది బోధన్ పట్టణ గ్రామానికి ఘోర అవమానంగా భావిస్తూ,ఇకపై పట్టణంలోని ఆలయాలకు బోధన్ గ్రామానికి చెందిన పెద్దలను అనుభవజ్ఞులు మాత్రమే కమిటీలో చైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.పార్టీలో ఇతర గ్రామాలకు చెందిన ఎంత మంది సీనియర్లు ఉన్నప్పటికీ, బోధన్ పట్టణానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో లేరా అని ప్రశ్నిస్తున్నారు.మును ముందు ఏ పార్టీ నుండైనా ఎమ్మెల్యేగా గెలుపొందినా గ్రామస్తులను మాత్రమే ఆలయ కమిటీలో వేయాలని,ఇతరులను వేస్తే అంగీకరించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.అతి తక్కువ కాలంలో హన్మంత్ రావును వాడుకొని తొలగించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వెంటనే ఆయను అధికారిక ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించాలని బోధన్ పట్టణ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..లేని యెడల గ్రామానికి జరిగిన ఘోర అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
అవమానాన్ని భరించలేక హన్మంత్ రావు సతీమణి ఎమ్మెల్యేకు ఫోన్.
ఆలయ కమిటీ అధ్యక్షులుగా కర్నె హన్మంత్ రావును ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రకటించిన అనంతరం సంతోషం వ్యక్తం చేసిన హన్మంత్ రావు సతీమణి, చైర్మన్ పదవి నుండి ఇటీవల తొలగించి ఘోర అవమానానికి గురి చేయడంతో,ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ప్రశ్నించడంతో ఆయన పొంతన లేని సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.చివరికి హన్మంత్ రావు సతీమణికి ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నుండి నిరాశే మిగిలిందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.
హన్మంత్ రావే చైర్మన్ గా ఉండాలని లింగాయత్ సమాజ్ డిమాండ్..
బోధన్ శ్రీ ఏక చక్రేశ్వర శివాలయ చైర్మన్ గా కర్నె హన్మంత్ రావుని ప్రకటించిన అనంతరం లింగయత్ సమాజ్ హర్షం వ్యక్తం చేసింది.ఇటీవల జరిగిన అవమానానికి తిరిగి హన్మంత్ రావునే చైర్మన్ గా కొనసాగేలా అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తుంది..ప్రతి నాయకుని చుట్టు ప్రక్కల ఉండే చీడ పురుగులే ఈ ఘోర అవమానానికి కారణమని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సమాజ్ పేర్కొంది.ఇకనైనా కర్నె హన్మంత్ రావుని చైర్మన్ గా కొనసాగించాలని బోధన్ నియోజకవర్గ లింగయాత్ సమాజ్ కోరుతోంది.
