నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందార్నా గ్రామానికి చెందిన ముగ్గురు పశువుల కాపరులు పశువులను మేపడానికి ఉదయం మంజీరా నది వైపు వెళ్లి నదిలో చిక్కుకుపోయారు. మంజీరా లో నీటి ప్రవాహం మధ్యాహ్నం వరకు పెరగడంతో ముగ్గురు నీటిలో చిక్కుకున్నారు. దీంతో స్థానికులు సొసైటీ చైర్మన్ రవికి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రూరల్ సీఐ,ఎస్ఐలు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాల్ల సహాయంతో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గ్రామస్తులు పోలీసులను మరియు గజ ఈతగాలను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులను మేపేందుకు నదులు, కాలువలు ప్రవహించే ప్రాంతంలోకి వెళ్ళొద్దని పోలీసుల సూచించారు.

Author: Kaburu Daily News
Post Views: 996