మహిళలను బెదిరించి దోచుకెళ్లి..
ఓ మహిళను బెదిరించి నగదు, నగలను దోచుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నారాయణపేట గ్రామానికి చెందిన జనకంపేట్ లక్ష్మీ 55 ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అయితే బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో, ముగ్గురు గుర్తులు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. ఆమె ఇంటి తలుపులు కొట్టి, మీ మరిది చనిపోయాడని చెప్పడంతో, సదరు మహిళా తలుపులు తీసింది. దీంతో దుండగులు లక్ష్మీ కి కత్తి చూపించి, చంపి వేస్తామని బెదిరించి, బీరువాలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు, కొంత నగదును దోచుకొని పరారయ్యారు. దీంతో బాధితురాలు కొడుకు మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే డయల్ 100, లేదా 8712659853 నంబర్ కి సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు.
