నల్లమలలో కనిపించిన అడవి దున్న..
కబురు న్యూస్,నల్లమల,జులై 03 :
నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ మంగళవారం సాయంత్రం కనిపించింది.నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అటవీ అధికారులు దీన్ని గుర్తించారు.వెంటనే వీడియో,ఫొటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో నిన్న సాయంత్రం అడవిదున్న కనిపించింది.నాగార్జున సాగర్,శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ఈ విషయమై మాట్లాడారు.ఇన్నేళ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమని అన్నారు.పెద్దపులులు,ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానాన్ని,దాటుకుని నల్లమలకు చేరి ఉంటుందని వెల్లడించారు…

Author: Kaburu Daily News
Post Views: 720