జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి..
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు….
కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,జులై 02 :
ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే,రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు.మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.దానికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు..

Author: Kaburu Daily News
Post Views: 834