సల్మాన్ ఖాన్ అందుకే వివాహం చేసుకోలేదు..
కబురు సినిమా న్యూస్,జూన్ 24 :
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లిపై ఆయన తండ్రి సలీమ్‌ఖాన్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సల్మాన్ తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త,పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడు.ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదు.అందుకే సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని సల్మాన్ తండ్రి సలీమ్ వైరల్ గా మారిన ఆ వీడియోలో వివరించారు.సల్మాన్ జీవితంలో ఆయన కోరుకున్న అమ్మాయి దొరికి పెళ్లి అవుతుందా లేదా వేచి చూడవలసిందే మరి

Author: Kaburu Daily News
Post Views: 171