ఘట్కేసరులో దారుణం..మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య..
కబురు న్యూస్,మేడ్చల్,జూన్ 24 :
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.వివాహేతర సంబంధంమే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 42 సంవత్సరాలు ఘట్కేసర్ డంపింగ్ యార్డులో శవమై తేలాడు.ఆయన కనిపించకుండా పోవడంతో ఈ నెల 17 న కుటుంబ సభ్యుల పిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా,నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి,ఘట్కేసర్ డంపింగ్ యార్డులో పాతి పెట్టినట్లు తెలుస్తోంది.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Author: Kaburu Daily News
Post Views: 959