డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా ఛాన్స్..
కబురు న్యూస్,హైదారాబాద్,నవంబర్ 06 :
డిఎస్సీ-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది.నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెప్టెంబర్ నెలాఖరులో విద్యాశాఖ కోరింది.ఈ క్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి వారికి కొలువులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.సంగారెడ్డి,రంగారెడ్డి,హనుమకొండ,ఖమ్మం,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్,మహబూబ్ నగర్ జిల్లాల్లో బాధితులున్నట్లు గుర్తించారు.ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

Author: Kaburu Daily News
Post Views: 82