May 15, 2025 6:12 pm

Follow us

Top 10 direct selling companies in india

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఎక్కడ..?

కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 10: నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సోమిరెడ్డి గత పదిరోజులుగా కార్యాలయానికి రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల కాశ్మీర్‌ పెహల్గాం ఘటన అనంతరం దేశవ్యాప్తంగా ఏర్పడిన సున్నిత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సెలవులో ఉన్న అధికారులందరిని వెంటనే విధుల్లో చేరాలని మౌకికంగా ఆదేశించినప్పటికీ,డీసీ సోమిరెడ్డి మాత్రం ఇప్పటికీ కార్యాలయానికి హాజరు కాకపోవడం కొసమెరుపు..

సెలవుపై వెళ్లడం నిజమేనా? లేక అధికార దుర్వినియోగమా?

కబురు న్యూస్ ప్రతినిధులు రెండు మార్లు డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించినపుడు,అక్కడి సిబ్బంది “సారు సెలవుపై ఉన్నారు” అని చెప్పినా,అది పొంతన లేని సమాధానం మరీ అనుమానాస్పదంగానే ఉంది.అధికారిక సెలవుపై వెళ్ళారా..??లేక ఇతర కారణాల వల్లే గైర్హాజరౌతున్నారా అన్నది అక్కడ కార్యాలయంలో ఏమాత్రం స్పష్టత లేదు.

ప్రజాల్లో అవగాహన కార్యక్రమాలనూ వదిలేశారు

బాన్సువాడలో కల్లు సేవించి ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కూడా సోమిరెడ్డి హాజరు కాలేదు.ఇది ప్రభుత్వ బాధ్యతల పట్ల ఉన్న విముఖతకు సూచనగా పలువురు భావిస్తున్నారు.

ఫోన్ చేస్తే కట్..తిరిగి ఎటువంటి స్పందన లేదు

కబురు న్యూస్ ప్రతినిధులు ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా,సోమిరెడ్డి ఫోన్ కట్ చేసి తిరిగి మెసేజైనా పెట్టకపోగా కాల్ కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఒకవేళ సెలవులో ఉన్నా ఇన్ని రోజులా..??

ప్రస్తుత యుద్ధ వాతావరణ దృష్ట్యా మానవతా దృక్పథంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ జిల్లా అధికారిగా ఒకవేళ అధికారిక సెలవుపై వెళ్ళినా తనకు తానే విధుల్లో చేరి ఉంటే,భారత సైన్యాన్ని గౌరవించిన వారాయ్యేవారని పలువురు ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు.ఒకవేళ అధికార సెలవులో ఉన్నా ఇలా చేయడం తగినది కాదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాల్లో ఇంకెంత మంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సెలవులో ఉన్నారో తేలాల్సి ఉంది. సాక్షాత్తు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సెలవులు పెట్టకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది ఫీల్డ్ వరకు అంటూ కార్యాలయాలకు రాకుండా సొంత పనులు చక్క పెడుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికైనా,జిల్లా పరిపాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు,ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పష్టతనిచ్చి,తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Top 10 direct selling companies in india

Leave a Comment

error: Content is protected !!