పోలీస్ కమిషనర్ ని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్..
కబురు న్యూస్,ఇందూర్ నగరం, మార్చ్ 15 :
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోతరాజు సాయి చైతన్యను శనివారం రోజున ఆయన కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ,నిజామాబాదు జిల్లాలో శాంతి భద్రతలు అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లావ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్,గంజాయి,మారకద్రవ్యలపైన ఉక్కు పాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని అన్నారు.మారకద్రవ్యల పైన పోలీస్ శాఖ వారు కళాశాల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.నగరంలో వరుస దొంగతనాలు చైన్ స్నాచింగ్,ఆటో,బైక్ దొంగతనాలు అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు.నగరంలో ట్రాఫిక్ సమస్య,ఫుట్ పాత్ కబ్జాలు,అక్రమ భూ కబ్జాలపై ప్రతేక ద్రుష్టి పెట్టాలని,కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోని సామాన్య ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.జిల్లా అభివృద్ధి,లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పోలీస్ శాఖ వారు తీసుకునే ప్రతి అంశంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.ఎమ్మెల్యే ధన్ పాల్ చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన సిపి పోతరాజు సాయి చైతన్య శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని అందించడానికి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటూ,అవసరమైతే మీ సహకారాన్ని కూడా తీసుకుంటామని ఎమ్మెల్యేతో అన్నారు.
